calender_icon.png 28 August, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద దెబ్బకు.. కోళ్ల ఫారం కొట్టుకుపోయింది

28-08-2025 12:14:43 PM

వరద ఉదృతికి కొట్టుకుపోయిన పౌల్ట్రీ ఫ్రాం భారీగా ఆస్తినష్టం

21 రోజుల 5000 కోడి పిల్లలు ,పౌల్ట్రీ ఫార్మ్ షెడ్ మరియు ఇల్లు.... నష్టం సుమారు 25 లక్షల భారీ నష్టం

బోరున విలపిస్తున్న యజమాని పృథ్వీరాజ్ 

ఎల్లారెడ్డి,విజయక్రాంతి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామ సమీపంలో ఉన్న కోళ్ల ఫారం భారీ వరదకు కొట్టుకపోయింది. కోళ్ల ఫారం లో 21 రోజుల 5000 కోడి పిల్లలు ,పౌల్ట్రీ ఫార్మ్ షెడ్, ఇల్లు.... నష్టం సుమారు 25 లక్షల భారీ నష్టం జరిగినట్లు యజమాని పృథ్వీరాజ్ తెలిపారు. పౌల్ట్రీ ఫార్మ్ సమీపంలో ఉన్న ఒక గదిలో కాపలాదారులు వరదల్లో చిక్కుకోగా మంగళవారం ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, రెస్క్యూటివ్ సిబ్బంది సహాయంతో అక్కడ పనిచేస్తున్న కాపలాదారులను కాపాడి గట్టెక్కించారు. పౌల్ట్రీ ఫారం పూర్తి భారీ వరదకు కొట్టుకుపోవడంతో నీలమట్టమై ఆ రైతు తీవ్ర ఆందోళనలో దిగ్భ్రాంతి చెందుతున్నారు. అధికారులు తను కాపాడాలని వేడుకుంటున్నారు.