calender_icon.png 28 August, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగిపొర్లుతున్న అర్కండ్ల

28-08-2025 10:02:50 AM

నిలిచిపోయిన రాకపోకలు

హుజురాబాద్,(విజయక్రాంతి): రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కరీంనగర్ జిల్లా(Karimnagar District) శంకరపట్నం మండలంలోని అర్కండ్ల వాగు నీటి ప్రవాహంతో పొంగిపొర్లడంతో బుధవారం సాయంత్రం నుండి రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా మండలంలో వర్షం కురవడంతో అర్కండ్ల వాగు నీటితో పొంగిపొర్లుతుందని దీంతో గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, గ్రామం మీదుగా వీణవంక మండలం చల్లూరు మామిడాలపల్లి మీదుగా పెద్దపెల్లి జిల్లా మంచిర్యాల జిల్లా తో పాటు మహారాష్ట్ర వరకు నిత్యం ప్రయాణం కొనసాగుతుందని, ప్రజల సౌకర్యార్థం బ్రిడ్జ్ నిర్మించాలని గ్రామ ప్రజలు ఎన్ని వినతి పత్రాలు అందజేసిన పాలకులు పట్టించుకోవడంలేదని, పాలకుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు, గ్రామస్తులకు వర్షాకాలంలో వర్షాలకు నీరు ప్రవాహం పెరిగి రాకపోకలు కొనసాగించాలంటే  తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికైనా పాలకులు ఉన్నతాధికారులు స్పందించి అర్కండ్ల వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేసి ప్రయాణికుల గ్రామస్తుల కష్టాలు తీర్చాలని కోరుచున్నారు.

భారీ వర్షాల దృశ్య మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కేశపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి.

గత రెండు రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో  మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అరకండ్ల వాగు ని ఎస్ ఐ శేఖర్ రెడ్డి గురువారం సందర్శించారు. వాగు ఉధృతంగా  ప్రవహిస్తుందని. చల్లూరు,కేశపట్నం రహదారి మూసివేసామని వాహనదారులు, రైతులు సహకరించాలని కోరారు.  ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప మండల ప్రజలు బయటకు రావద్దని కోరారు. అత్యవసర సమయంలో 100 కు డయల్ చేయాలని కోరారు.