28-08-2025 10:23:02 AM
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు భారీ వరద నిజాంసాగర్ ప్రాజెక్టులోకి(Nizamsagar project) చేరుతుంది. బుధవారం ఉదయం పసుపులేరు మరియు హల్ది వాగు, నుండి సుమారు లక్ష క్యూసెక్కుల వరకు వరదరావడం, పోచారం ప్రాజెక్టు నుండి, సుమారు 1,65,000 క్యూసెక్కుల వరద మాంజీర నదిలో కలవడం, సింగూర్ ప్రాజెక్టు ఘనపూర్ ఇతర ప్రాజెక్టుల నుండి సుమారు లక్ష క్యూసెక్కుల వరకు భారీ వరద మాంజీర నది నుండి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రవేశించడం పట్ల పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యమే దిగువనున్న గ్రామాల ప్రజలకు శాపంగా మారనుంది. పక్షం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి అత్యధికంగా వరద చేరడం దిగువన ఉన్న ప్రజలకు అప్పటికే నష్టం వాటిల్లినప్పటికీ ప్రాజెక్టు అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 17 టీఎంసీలు అయినప్పటికీ వర్షాకాలం ఇంకా సమయం ఉన్నప్పటికీ ప్రాజెక్టును కొంతమేరకు ఖాళీగా ఉంచుకోక ప్రాజెక్టు నీటిమట్టం సామర్థ్యం పూర్తిగా నింపి ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు ప్రజలను పలు గ్రామాలలో ఇబ్బందుల్లో పడేస్తున్న నిజాంసాగర్ నీటిపారుదల శాఖ అధికారులు. ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతూ ఓవైపు ప్రజలను దిగువన ఉన్న పలు గ్రామాల నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులు భయభ్రాంతులకు గురిచేస్తూ నరకం చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలను ఖాళీ చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు సంబంధిత శాఖ అధికారులతో కోరగా ప్రాజెక్టు పరిస్థితి మాత్రం ఓ పక్క భయాందోళన తీవ్ర వర్షాల కారణంగా నిజాం సాగర్ ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరుతోంది. దీనివల్ల త్వరలోనే 2,50,000 క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేయనున్నారు. దీని కారణంగా క్రింది గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశముంది.
ముంపు ప్రమాదంలో ఉన్న గ్రామాలు:
పిట్లం మండలం,కూర్థి గ్రామం
నిజాంసాగర్ మండలం
గొర్గల్, మాగి, మర్రిపల్లి, లింగంపల్లి గ్రామాలు
మహ్మద్‌నగర్ మండలం
గుంగుల్, తుంకిపల్లి గ్రామాలు
బాన్సువాడ మండలం
బుడిమి, బాన్సువాడ, నాగారం, దామరంచ, చించిల్లా, కిస్టాపూర్, బిర్కూర్, బిరంగెడి గ్రామాలు
నిజామాబాద్ జిల్లా
పోతంగల్ మండలం: కొడిచెర్ల, సుంకిని, కొల్లూరు, కల్లూరు, హెగ్డోళి, హుంగ్రగ గ్రామాలు
సలోర మండలం
నది తీర గ్రామాలు
బోధన్ మండలం
నది తీర గ్రామాలు, భద్రత నిమిత్తం అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటూ ప్రజలను ఎగవ ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని ప్రాంత ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు.
ప్రాజెక్ట్ అధికారుల నిర్లక్ష్యం మమ్మల్ని తరలింపు
ముందస్తుగానే నీటిని సామర్థ్యం గా మైంటైన్ చేసి ముంపు రాకుండా జాగ్రత్త పడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు మండిపడుతూ అధికారులను వేడుకుంటున్నారు.