1 July, 2026 | 6:38 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

వెంకటరమణారెడ్డికి బ్రిక్స్ యూనియన్ సంతాపం

25-06-2025 06:57 PM

అశ్వాపురం (విజయక్రాంతి): మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన ఇటుక బట్టీల వ్యాపారి సురకంటి వెంకటరమణారెడ్డి ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందగా, ఇటుక బట్టీల వ్యాపారస్తులు బుధవారం బ్రిక్స్ యూనియన్ కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని, సేవా భావాన్ని, ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకొని పలువురు ఆయన సేవలను కొనియాడారు. ఆ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇటుక బట్టీల యూనియన్ అధ్యక్షులు మర్రి మల్లారెడ్డి, గౌరవ అధ్యక్షులు తలపనేని కొండలరావు, యూనియన్ సభ్యులు ఆగిటి రవీందర్ రెడ్డి, గుర్రం రవి, బద్దం వెంకటరెడ్డి, ముద్దం సైదిరెడ్డి, సాదినేని నాగేశ్వరరావు, వడ్డేం పూడి రాము, చిగురుపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.