11 May, 2026 | 4:06 PM

జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతి

07-08-2025 12:51 AM

ఖమ్మం, ఆగస్ట్ 6 (విజయ క్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజా కవి గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తు మ్మల యుగేందర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఆవిర్భావానికి చేసిన సేవలను కొనియాడారు. గద్దర్ వారి పాటలతో తెలంగాణలో ఎంతో చైతన్యం తెచ్చార ని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్య వసాయ మార్కెట్ చైర్మన్ యారగర్ల హనుమంతరావు, వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, ఆ త్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు కొ త్త సీతారాములు, నగర అధ్యక్షులు నరాల నరేష్, కమతం రామకృష్ణ, తుంపాల కృష్ణమోహన్ గారు,లతీఫ్,దండా ప్రసాద్,బొమ్మ ఉదయ్,కుక్కల మహేష్ తదితరులుపాల్గొన్నారు.

 కొత్తగూడెం,ఆగస్టు 6, (విజయక్రాంతి) :సింగరేణి ప్రధాన కార్యాలయం లోని హెచ్‌ఆర్డి కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం తెలం గాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొ జయశంకర్ జన్మదిన వేడుకలు ఘ నంగా నిర్వహించారు. ఏజేఎం మురళీధరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా డైరక్టర్(పి&పి) శ్రీ కే.వెంకటేశ్వర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ ఉత్తర్వుల మేరకు, తెలంగాణ తొలి ఉద్య మ నేత, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొII కొత్తపల్లి జయశంకర్ జయంతి ఉత్సవాలను, ఘ నముగా జరుపుకోవటం చాలా సంతోశంగా ఉందన్నారు.

కార్పొరేట్ కార్యలయం లో మాత్రమే కాకుండా,సింగరేణి వ్యాప్తముగా ఈ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నా మన్నారు. ప్రొII కొత్తపల్లి జయశంకర్ ఆర్థికశాస్త్రంలో పీహెచ్ డి పట్టా పొంది, ప్రిన్సి పాల్ గా, రిజిష్టార్ గా పనిచేసి కాకతీయ వి శ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు.. నీళ్ళు, నిధుల సిద్ధాంతముగా రూపొందించుకొని, ప్రజలను చైతన్య పరచి తెలంగాణ ఏర్పాటు లో, ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు.

ప్రొఫెసర్ జయశంకర్ ప్రత్యేక తెలంగాణ కొరకు ఏవిధముగా శ్రమించారో, అదే విధముగా ప్రతీ ఉద్యోగి సంస్థ అభివృద్ధి కొరకు స్వచందంగా పాటుపడాలన్నారు. అనంతరం తె లంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జ యశంకర్ జయంతి ఉత్సవాల్లో జనరల్ మే నేజర్లు, శాఖాధిపతులు, అధికారులు ఉద్యోగులు ఆయన చిత్రపటానికి ఘనంగా పూల మాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమములో సింగరేణి అధికారులు, సిబ్బంది, రాజకీయ నాయకులు, యూనియన్ ప్రతినిధులు,సంఘ ప్రెసిడెంట్లు , కా ర్పోరేట్ లోని వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

భద్రాచలం, ఆగస్టు 6 (విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర ఉద్యమ దీప్తి, తెలంగాణ జా తిపిత, ఏదైనా కార్యం సాధించాలంటే కృషి పట్టుదల, ధైర్యంతో ముందడుగు వేస్తే ఎం తటి కష్టార్జితమైన కార్యం అయిన చాలా సు లభంగా సాధించుకోవచ్చునని, తెలంగాణ రాష్ట్ర సాధనలో యువకులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఉద్యమాన్ని నడిపిన స్ఫూర్తి ప్రదాత ఆచార్య జ యశంకర్ సార్ అని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

బుధవారం ఐటిడిఏ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన ఆచార్య జయశంకర్ సార్ 91 వ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అ తిథిగా పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన అనం తరం ఆయన మాట్లాడుతూ 1934 ఆగస్టు 6న హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఆయ న జన్మించారని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధికి వెనుకబడి పోతున్నారని ఆవేదన చెంది,1969 సంవత్సరం నుం డి తెలంగాణ రాష్ట్రం కొరకు అహర్నిశలు పాటుపడుతూ, ఇటు ప్రజలకు, యువకులకు మనోధైర్యాన్ని నింపి 29వ రాష్ట్రంగా తె లంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన అన్నారు.

ఆచార్య జయశంకర్ సార్ చేసిన కృషి ఫలితంగా తెలంగాణ ప్రజలు ఆయన పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా మరియు హన్మకొండలో ఒక పా ర్కును ఏర్పాటు చేసిందని అన్నారు. ఆచార్య జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నా మనం ప్రభుత్వ పథకాలు ప్రజలకు దరిచేరే విధంగా పట్టుదలతో పని చేయాలని, ము ఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు సేవ చేసి వారికి చెందవలసిన స్వయం ఉపాధి పథకాల గురించి చెప్పి, మంచి మనసుతో పని చేస్తే ప్రజలు మిమ్మల్ని కొనియాడటమే కాక వాళ్లు కూడా చాలా సంతోషిస్తారని అన్నారు. పనిచేయాలని తపన ప్రతి ఉద్యోగికి ఉండాలని, గత సంవత్సరం చేసిన పని కంటే ఈ సంవత్సరం ఎక్కువగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతాను అనే లక్ష్యం పెట్టుకొని, తమ విధులను నిర్వహించాలని పిఓ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ ,ఏ సి ఎం ఓ రమేష్ , ఏడి అగ్రికల్చర్/ఎస్ ఓ భాస్కరన్, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు,జేడీఎం హరికృష్ణ,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.