07-08-2025 12:52:28 AM
డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ హెచ్చరిక
ఆదిలాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఆర్‌ఎంపీలు అర్హతకు మించి వైద్యం చేయొద్దని కేంద్రాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి డాక్టర్ నరేందర్ రాథోడ్ హెచ్చరించా రు. బుధవారం ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైవేట్ క్లినిక్‌లతోపాటు ప్రాథమి క ఆరోగ్య ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మావల సబ్ సెంటర్‌ను డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసు పత్రిలో రికార్డ్సు సరిగ్గా లేకపోవడంతో సం బంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందితో మాట్లాడి డెంగ్యూ కేసులపై ఆరా తీశారు. అదేవిధంగా పలు క్లినిక్ల ను తనిఖీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీలకు ఆసుపత్రులు మూసివే యాలని నోటీసులు అందజేశారు.
అదేవిధంగా నలుగురు ఆర్‌ఎంపీలకు రూ.పదివేల చొప్పున జరిమానా విధించారు. ఆర్‌ఎంపీ లు పరిమితులకు లోబడి ప్రాథమిక వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ డిఎంహెచ్‌ఓ సాధన, డీఐఓ డా. వైసీ శ్రీనివాస్, మలేరియా అధికారి మిట్టపెల్లి శ్రీధర్ పాల్గొన్నారు.