calender_icon.png 14 August, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు ఏరియాలో గైర్హాజరీ ఉద్యోగులకు కౌన్సెలింగ్

07-08-2025 12:49:58 AM

ఇల్లెందు, ఆగస్టు 6 (విజయక్రాంతి):సింగరేణి ఇల్లందు ఏరియాలో విధులకు గైర్హాజరవు తున్న కార్మికులకు యాజమాన్యం బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించింది. 1 జనవరి నుండి జూన్ వరకు 80 మస్టర్ల కంటే తక్కువ హాజరు ఉన్న 11 మంది ఉద్యోగులకు అధికారులు ఓ.సి.ఓ.ఏ క్లబ్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. గైర్హాజరీతో వేతనం నష్టపోవడమే గాక, ఉత్పత్తి లక్షానికి ఆటంకం ఏర్పడుతుందని జీఎం వి.కృష్ణయ్య తెలిపారు. విదులు సక్రమంగా చేయకపోతే కలిగే అనర్ధాలను వివరించారు.

గైర్హాజరీకి గల కారణాలను తెలుసుకుని, సలహాలు, సూచనలు చేశారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. విధులకు సక్రమంగా హాజ రయ్యే ఉద్యోగులకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని జీ.యం తెలిపారు. గతంలో మాదిరి కష్టమైన పనులు ప్రస్తుతం సింగరేణిలో లేవని, ప్రతి ఉద్యోగి హాజరు శాతాన్ని పెంచుకుని సంస్థ అభివృద్ధిలో భాగ స్వామికావాలని సూచించారు.

ప్రతి ఉద్యోగి నెలలో 22 మస్టర్లు విధిగా పూర్తి చేయాలని జీ.యం వి.కృష్ణయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ అధికారి జాకీర్ హుస్సేన్, ఎజియం(ఐఇ) గిరిధర్ రావు, డీజిఎం పర్సనల్ అజ్మీర తుకారాం, డీజిఎం (ఇ&యం.) సి.హెచ్.పి. క్రిస్తోపర్, డివైసియంఓ నరసింహరావు, అడిషనల్ మేనేజర్ కే.ఓ.సి. బ్రహ్మం, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్, సంక్షేమ అధికారులు, ఇతర ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.