నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు
l మే 26న పరీక్ష
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ సెషన్ ఫలితాలు విడుదల కావడంతో ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రి య ఈరోజు (శనివారం) నుంచి ప్రారంభం కానుంది. మే 7 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జేఈ ఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు రాసేందుకు వీలు కల్పిస్తారు. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పేప ర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్‌కు అప్పగించారు. వీటి ఫలితాలను జూన్ 9న ప్రకటిస్తారు. దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో 2024 విద్యా సంవత్స రానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్న విషయం తెలిసిందే.






