2 April, 2026 | 5:28 AM

ఇందూరులో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

15-05-2024 02:20 AM

నిజామాబాద్, మే 14 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయి ఎన్ని కుట్రలు పన్నినా, వాటన్నింటినీ పటాపంచలు చేసి నిజామాబాద్‌లో విజయం సాధించి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామ ని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం మీడియాతో  మాట్లాడారు. మత సామరస్యానికి ప్రతీక అయిన నిజామాబాద్‌లో బీజేపీ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నించారని మండిపడ్డారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, తాహెర్ బీన్ హమ్దాన్ పాల్గొన్నారు.