టీ-సాట్‌లో టెట్ తరగతులు
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు నిర్వహించే టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష)కు సంబంధించిన తరగతులను టీ నిర్వహించనున్నట్లు సీఈఓ బీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు ఐదు సబ్జెక్టులపై అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మెళకువలతోపాటు సలహాలు, సూచనలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 15న సైకాలజీ, 16న టీచింగ్ మెథడ్స్, 17న తెలుగు, 18న ఫిజికల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులపై నిపుణ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతాయని వెల్లడించారు. మరుసటి రోజు టీ విద్యా ఛానల్‌లో సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు పునఃప్రసారమవుతాయని పేర్కొన్నారు.




