calender_icon.png 9 July, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిన్నారం మండల కురుమ సంఘం ఎన్నిక

09-07-2025 12:12:39 AM

పటాన్ చెరు/జిన్నారం, జులై 8 : జిన్నారం మండల కురుమ సంఘాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నకున్నారు. మాదారంలో సమావేశం జరిగింది. కురుమ సంఘం మండల అధ్యక్షుడుగా గుండా రాము, ఉపాధ్యక్షులుగా కురుమ రమేశ్, కార్యదర్శిగా కొప్పుల ప్రభు, సహాయ కార్యదర్శిగా కురుమ యాదయ్య, కోశాధికారిగా గుండా శ్రీశైలం, సలహాదారుగా కురుమ దుర్గయ్య, సభ్యులుగా కల్పగూరి సత్యనారాయణ, ఫతేనగర్ శివశంకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షెపర్డ్  ఇండియా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, కురుమ సంఘం జిల్లా నాయకుడు బూరగడ్డ నగేశ్, జోగిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, కురుమ సంఘం జిల్లా నాయకులు పాండు, అంబారీ ఈశ్వరయ్య, దుర్గయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.