calender_icon.png 9 July, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్చనీయాంశంగా కోట నీలిమ భారీ కటౌట్

09-07-2025 12:12:17 AM

మురిసిపోతున్న కాంగ్రెస్ శ్రేణులు

సనత్‌నగర్ జూలై 8 (విజయక్రాంతి):- హైదరాబాద్ మహానగరలోని రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకు రాలు కోట నీలిమను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన 60 అడుగుల భారీ కటౌట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాస్ ఇమేజ్తో ముందుకెళుతున్న కోట నీలిమను ప్రజలు, కార్యకర్తలు ఒక మాస్ లీడర్‌గా భావిస్తున్నారనడానికి ఈ కటౌట్ ఒక నిదర్శనంగా నిలిచిందని పలువురు చర్చించుకుంటున్నారు.

కొన్ని దశబ్దాలుగా సనత్ నగర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ లో మాస్ లీడర్ లేరని.. ఇప్పుడు కోట నీలిమతో ఆ లోటు తీరిపోయిందని అంటున్నారు. మరోవైపు కోట నీలిమ సైతం గెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ అప్పజెప్పిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రజలతో నిత్యం మమేకం అవుతూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరిస్తున్నారు.

మొన్న బల్కంపేట ఎల్ల మ్మ బోనాల, కల్యాణ ఉత్సవాన్ని తన భుజస్కందాలపై వేసుకొని విజయవంతం చేశా రు. మరోవైపు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభకు సనత్ నగర్ నియోజకవర్గం నుంచి 1,000 మందిని తరలించి సభ సక్సెస్ అవడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇలా ఓ వైపు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. 

మరోవైపు అధిష్టా నం అప్పజెప్పిన బాధ్యతలు తూచ తప్పకుండా పాటిస్తూ.. ఇంకోవైపు పెద్దపెద్ద పండ గలు భుజాన వేసుకొని సక్సెస్ చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యం లో ఏర్పాటు చేసిన 60 అడుగుల భారీ కటౌట్ చూసి కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు సైతం మురిసిపోతున్నారు.