09-07-2025 12:13:03 AM
సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారి
అబ్దుల్లాపూర్ మెట్, జూలై 08: నేడు నిర్వహించబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి అన్నారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ, రావి నారాయణరెడ్డి కాలనీ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆందోజు రవీంద్ర చారి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు.
నేడు నిర్వహించబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. అలాగే కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ. 26,000 అమలు చేయాలన్నారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎన్ పి ఎస్, యుపిఎస్ లను రద్దు చేసి, స్క్రీన్ వర్కర్స్ కి కనీస వేతనం ఈ ఎస్‌ఐ, పి ఎఫ్ ఇలాంటి సదుపాయాలు కల్పించాలన్నారు.
వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర చట్టం చేయాలి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అజ్మీరా హరి సింగ్ నాయక్, కే నర్సింహా, దాసరి ప్రసాద్, ఎం. రవి, ధూపం నిరంజన్, సైదుల్, సుధాకర్, బాల్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.