15 August, 2026 | 1:45 AM

త్వరలో జాబ్ క్యాలెండర్

18-06-2024 03:02 AM

హైదరాబాద్, జూన్ 17 ( విజయక్రాంతి): త్వరలో జాబ్ క్యాలెండర్ విడు దల చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు తెలిపారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..  మాజీ  మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలను తప్పుబట్టారు. మేము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని, మీరు వదిలి వేసిన అస్థవ్యస్థ ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నామన్నారు.  చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే హరీశ్‌రావు పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్న ఆయన తెలంగాణ ప్రజల ఆలోచనలు మాత్రమే అమలు చేస్తామని, ఏపీ ఆలోచనలు తమకు అవసరం లేదని చెప్పారు.

12 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పరీక్ష నిర్వహించామని, మూడు నెలల పరిపాలన చేయగానే ఎన్నికల కోడ్ వచ్చిందని.. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీ లు అన్ని అమలు చేస్తామని మ్రంతి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆశ వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్‌రావుకు లేదన్నారు. మీ హయాంలో ఆశ వర్కర్లను గుర్రాలతో తొక్కించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. పెద్దపల్లిలో జరిగిన సంఘటపై విచారణ జరుగుతోందని, ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, మత సంఘర్షణల వెనుక ఎవరి హస్తం ఉన్నా ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.