15-07-2025 12:00:00 AM
గద్వాల టౌన్, జూలై 14 : జిల్లాలోని నిరుద్యోగ యువతకు గద్వాల, ఐజ, కర్నూల్, మహబూబ్ నగర్ లోని కంపెనీ లలో శిక్షణ మరియు ఉపాధి కల్పించుటకు జాబ్ మేళా నిర్వహి స్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారిని ప్రియాంక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగులు 18 నుండి 35 సంవత్సరాల వయసు ఉండి ఎస్ ఎస్ సి, ఇంటర్ ఏదైనా డిగ్రీ మరియు ఎంబీఏ విద్యార్హత కలిగిన వారు ఈనెల 16వ తేదీన ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జిల్లా ఉపాధికల్పనా శాఖ కార్యాల యం, ఐడిఓసి కాంప్లెక్స్, F 30/1 నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీలు కాసం ఫ్యాషన్, పుస్కల్ ఆగ్రోటిక్, పి ఎం కె కె కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆమె ప్రకటన ద్వారా తెలిపారు.