15-07-2025 12:00:00 AM
బెజ్జుర్, జూలై 14(విజయ క్రాంతి):మండలంలోని సోమిని గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలోని రెండు లో లెవెల్ కల్వర్టులకు కోనేరు అభిమానులు మరమ్మతులు చే యించారు. పైపులలో చెత్త ఇసుక పేరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన ప్పకు ఫోన్ ద్వారా గ్రామ ప్రజలు సమాచా రం అందించడంతో స్పందించిన ఆయన జెసిబిని పంపించి మరమ్మతులు చేశారు.
బెజ్జూర్ నుండి సోమిని వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారికి మంజూరైన 3 లక్షల రూపాయల బిల్లులను లేపునట్లు తెలిసిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి ఆత్రం సాయన్న,లంగారి శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.