23-08-2025 12:00:00 AM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కరీంనగర్, ఆగస్టు 22 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రి సీతక్క పనుల జాతర ద్వారా అభివృ ద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు & శంకుస్థాపనలు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ నియోజకవ ర్గంలోని చిగురు మామిడి మండలం సీతారాంపూర్ లో 5 కోట్ల రూపాయల వ్యయం తో నూతనంగా నిర్మించిన సీతారాంపూర్ నుండి పర్లపెల్లి వయ పీచుపల్లి బీటీ రోడ్డును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
గ్రామంలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాం క్ పంపిణీ చేశారు. అలాగే సుందరగిరి ఎస్సీ కాలనీలో 10 లక్షల రూపాయల తో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజ కవర్గంలో ఉన్న మూడు జిల్లాల పరిధిలో 46 పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం సంక్షేమం ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయా ణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టమన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొన సాగుతున్నాయని ప్రజా సంక్షేమం, అభివృద్ధి పై అనేక కార్యక్రమాలు చేపట్టమన్నా రు.
ఇప్పటికే పూర్తి చేసుకున్న పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నా యని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తనజీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.