23-08-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ ఆగస్టు 22 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ గేట్ సమీపంలో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ముగ్గురు వ్యక్తులపై ఈ నెల 20న ట్రాఫిక్ పోలీసులు కేసులు న మోదు చేసి కోర్టులో హాజరపరిచారు. సాక్ష ఆధారాలను పరిశీలించిన నాగర్ కర్నూల్ జిల్లా న్యాయస్థానం వేరువేరుగా జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు.
తాడూరు మండలం బలాన్పల్లి గ్రామానికి చెందిన బీర్ల శ్రీశైలానికి 20 రోజుల జైలుతో పాటు రూ. 5000 జరిమానా, కుమ్మెర గ్రామానికి చెం దిన ఎండి. ఆరిఫ్ ఒక రోజు జైలు, రూ. 2000 జరిమానా, లింగాల మండలం బాక రం గ్రామానికి చెందిన అర్జున్ ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించారు.