1 September, 2026 | 10:16 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

12న నిజామాబాద్‌లో జాబ్‌మేళా

11-06-2024 | 12:45am

నిజామాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ నెల ౧౨న నిజామాబాద్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పన అధికారి సిరిమల్లె శ్రీనివాస్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వరుణ్ మోటర్స్, ఎంజీఎం మోటర్స్‌లలో ఈడీపీ ఎగ్జిక్యూటివ్స్, టెలీకాలర్స్, రిలేషన్‌షిప్ మేనేజర్స్, డెలివరీ ఇంచార్జ్‌లు, డ్రైవర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాంటి పోస్టులు భర్తీ చేయ నున్నట్టు తెలిపారు. ఈ ఉద్యోగాలకు 18 నుంచి 30 వయస్సున్న వారు అర్హులని, పోస్టును బట్టి ఎస్సెస్సీ, ఐటీఐ (ఎలక్ట్రీషియన్), డిగ్రీ, బీటెక్ అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12న ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం 3.30 నిమిషాల వరకు శివాజీనగర్‌లోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఇంటర్యూలకు హాజరుకావాలని కోరారు.