14 July, 2026 | 4:42 AM

పెద్దపల్లి జిల్లాలో జూలై 17న జాబ్ మేళా నిర్వహణ

14-07-2026 12:00 AM

జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.రాజశేఖర్

పెద్దపల్లి, జూలై 13(విజయ క్రాంతి)జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ బ్రాడ్బ్యాండ్ (Airtel Xstream Broadband) కంపెనీలో ఉద్యోగాలు కల్పించుటకు జూలై 17న శుక్రవారం జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ బ్రాడ్బ్యాండ్ సంస్థలో మొత్తం 54 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇందులో ఇంజనీర్లు 23 ఖాళీలు, వైర్మెన్లు 23 ఖాళీలు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో ఉంటాయని, ఇంజనీర్ ఉద్యోగాలకు డిగ్రీ ,డిప్లమా, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అర్హులని,

వైర్ మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి, డ్రైవింగ్ లైసెన్స్, కలిగిన అభ్యర్థులు అర్హులని సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కొరకు డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వయసు గల యువతి, యువకులు అభ్యర్థులు అని ఆసక్తి గల అభ్యర్థులు జూలై 17న ఉదయం 11 గంటలకు అప్డేట్ చేసిన సివి/రెజ్యూమ్, విద్యార్హత పత్రాల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు జిరాక్స్, అనుభవ ధృవీకరణ పత్రం (ఉంటే) తీసుకుని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం మొదటి అంతస్తులోని రూమ్ నెం. 233కు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 9908674056, 8985336947, 8121262441 నంబర్లలో సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.