ప్రజలకు మెరుగైన పోలీసింగ్ ఇవ్వడమే లక్ష్యం: డీఐజీ జోయెల్ డేవిస్
14-07-2026 12:00 AM
నల్లగొండ క్రైం, జూలై 13 : ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రతి అధికారి లక్ష్యంగా ఉండాలని యాదాద్రి జోన్-V డీఐజీ డి. జోయెల్ డేవిస్ అన్నారు.సోమవారం నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలోజిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి నేర సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ శాంతిభద్రతల్లో రాజీ వద్దని, నేర నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి కేసులో శాస్త్రీయ, డిజిటల్ ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలన్నారు.జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, సైబర్ నేరాలు, ట్రాఫిక్, మహిళల భద్రతపై అవగాహన పెంచాలని ఆదేశించారు.సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్‌ఓలు పాల్గొన్నారు.






