శివాలయానికి పోటెత్తిన భక్తజనం
14-07-2026 12:00 AM
మేళ్లచెరువు, జులై 13 : స్థానిక శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయానికి సోమవారం పర్వదిన సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి, సోమవారం, అన్ని ఒకే రోజు కావడంతో తెల్లవారుజామునుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా శివపార్వతులకు కళ్యాణం, అన్నాభి షేకం, గోపూజ, తదితర కార్యక్రమాలు అర్చకులు ఘనంగా జరిపారు.
కోదాడ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు బొల్లం మల్లయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణఅధికారి ఎన్.శంబిరెడ్డి ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుడు పి. లచ్చయ్య అర్చకులు కే విష్ణువర్ధన్ శర్మ,కే ధనుంజయ శర్మ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






