12 August, 2026 | 2:41 AM

ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

12-08-2026 01:05 AM

ఎమ్మెల్సీ కోదండరాం

ముషీరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాం తి): ఎన్ హెచ్‌ఎంలో పనిచేస్తున్న మెడికల్, హెల్త్ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల స మస్యలను పరిష్కరించి, వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఎన్ హెచ్ ఎం జేఏసీ చైర్మన్ డాక్టర్ మహేందర్  ఆధ్వర్యం లో మంగళవారం ధర్నాచౌక్లో ధర్నా నిర్వహి ంచారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కోదండరాం, వికలాంగుల హక్కుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బక్క జడ్సన్ హాజరై ఉద్యోగులకు మద్దతు తెలిపారు.

కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఎన్ హెచ్ ఎం లోని 78 కేడర్ల సమస్యలను పరిష్కరించి, ప్రతి కేడర్కు ఫిక్సేషన్ చేసి 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. జీవో 1195ను పునఃపరిశీలించి, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలో కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమానికి వందలాదిమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు హాజరై  ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు.