ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి
12-08-2026 01:06 AM
కుత్బుల్లాపూర్, ఆగష్టు 11(విజయక్రాం తి): కట్ట మైసమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా బీ జేపీ నాయకులు రచ చక్రధర్ ఆకాక్షించారు. మల్కాజ్గిరి లోని కట్ట మైసమ్మ దేవాలయం లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం లో జిల్లా బీజేపీ నాయకులు రచ చక్రధర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రధర్ మా ట్లాడుతూ కట్ట మైసమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. అనంతరం ఈటె ల జమునమ్మ పుట్టిన రోజు సందర్భంగా మ ర్యాదపూర్వకంగా కలిసి జమునమ్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర నా యకులు రవి నాయక్, బీజేపీ నాయకులు రాజు, పద్మ తదితరులు పాల్గొన్నారు.






