6 June, 2026 | 1:45 AM

తేజస్ అకాడమీ విద్యార్థులకు డిఫెన్స్‌లో ఉద్యోగాలు

06-06-2026 12:00 AM
  1. అగ్నివీరులుగా ఎంపికైన 160 మంది
  2. అభినందించిన సంస్థ చైర్మన్ సతీష్‌రావు

కరీంనగర్ క్రైమ్, జూన్ 5 (విజయక్రాం తి): తేజస్ అకాడమీ నుంచి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం. 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో ముగ్గురు విద్యార్థులు ఇండియన్ ఎయిరఫారెస్‌లో అగ్నివీరులుగా ఎంపికై ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు సాధించారు.

జూన్ 2025 హన్మకొండ ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి 31 మే 2026న వచ్చిన మె రిట్‌లో అగ్నివీరులుగా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాగే జూన్ 1, 2026 న వచ్చిన ఇండియన్ ఎయిరఫోర్స్ మెరిట్ లిస్ట్ లో ముగ్గురు అగ్నివీరులుగా ఎంపిక కావడం ఈ సందర్భంంగా తేజస్‌లో షార్యా 2026‘ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను తేజస్ అకాడమీ చైర్మన్ సీహెచ్ సతీష్ రావు అభినందించి జ్ఞాపికలు అందించారు.