6 June, 2026 | 1:44 AM

గద్దర్‌పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అవమానకరం

06-06-2026 12:00 AM
  1. సహాయాన్ని అప్పుగా భావిస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం
  2. కారు ఇచ్చానని నిరూపించకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి
  3. సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్

ముషీరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రజా గాయకుడు గద్దర్ గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అవమానకరమని సెంటర్ ఫర్ బెటర్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్ డైరెక్టర్ మామిడి నారాయణ విమర్శించారు. గద్దర్కు తాను కారు కొనిచ్చానని పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ గద్దర్ కోసం ఏ సంవత్సరం, ఏ కారు, ఏ షోరూం ద్వారా కొనుగోలు చేశారో ప్రజలకు తెలియజేయాలని కోరారు. లేనిపక్షంలో పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గద్దర్ జీవితకాలంలో ఉపయోగించిన వాహనాల వివరాలు అందరికీ తెలిసినవేనని పేర్కొన్నారు.

ఆధారాలు లేకుండా గద్దర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాను గద్దర్కు ఇచ్చిన సహాయాన్ని అప్పుగా భావిస్తే వడ్డీతో సహా చెల్లించేందుకు సిద్ధమని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలంగాణ వాదంపై విషం కక్కుతూనే ఉన్నారన్నారు.  కాషాయ రంగును కడుపులో పెట్టుకొని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో గద్దర్ అభిమానుల సం ఘం అధ్యక్షుడు యాదగిరి, ఆశ శ్రీరాములు, డాక్టర్ మంచాల లింగస్వామి పాల్గొన్నారు.