calender_icon.png 20 November, 2025 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీలో పలువురి చేరిక

16-08-2024 01:46:25 AM

కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

రాజేంద్రనగర్, ఆగస్టు 15: దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరుతున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని పార్టీ కార్యాలయంలో సీనియర్ నేత బొక్క బాల్‌రెడ్డి సమక్షంలో నార్సింగి మున్సిపాలిటీకి చెందిన పలువురు నాయకులు, యువకులు పెద్దసంఖ్యలో ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారి కి పార్టీ కండు వా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నార్సింగి మున్సిపాలిటీలో పాగా వేస్తామన్నారు. బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరు గుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు పతి జైదీప్‌రాజ్, కవిరాజ్, విజయవర్దన్, మునక సురేశ్‌కుమార్, క్రాంతికుమార్, నవీన్‌కుమార్, రామ్‌పవన్, ఉదయ్‌చారి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.