16-08-2024 01:40:04 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి) : స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు, బాలికల భద్రతకు సంబంధించి హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి నగరంలో ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొంతమంది ఆకతాయిలు షాపింగ్‌మాల్స్, టాయిలెట్స్, వస్త్ర దుకాణాల వంటి ప్రదేశాల్లో హిడెన్(రహస్య) కెమెరాలను అమర్చి మహిళలను వేధింపులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.
ఇలాంటి ఘటనలను అరికట్టడానికి నగరవ్యాప్తంగా ఉన్న చిన్నా, పెద్ద వస్త్రదుకాణాలు, మాల్స్‌లోని డ్రెస్సింగ్ రూమ్స్, వాష్‌రూమ్‌లలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. ఇందుకోసం ఎన్‌ఎస్‌ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) విద్యార్థులు ప్రతి ఏరియాలోని అనుమానిత ప్రాంతాల్లో తిరుగుతూ ఆయా దుకాణాలు, మాల్స్‌లో తనిఖీలు నిర్వహించి ‘నో హిడెన్ కెమెరా ఇన్‌సైడ్’ అని స్టిక్కర్ అతికిస్తారు. అయినప్పటికీ ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.