08-10-2025 08:05:27 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): చింతల మానేపల్లి మండలం బాబాపూర్ గ్రామం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vithal) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి.చేరిన వారిలో రాపెల్లి రామయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్, దర్నేని సత్తయ్య మాజీ సర్పంచ్,అరిగేలా రామ గౌడ్ మాజీ ఎంపీటీసీ సభ్యులు, రౌతు రామయ్య మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్, దాసరి రామయ్య కాపు సంఘం అధ్యక్షుడు,బాపూజీ మన్నెవార్ సంఘం అధ్యక్షుడు,వారితో పాటు 50 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక అయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.