calender_icon.png 8 October, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరిని కలుపుకొని వెళ్లాలి

08-10-2025 01:39:51 AM

మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : సహచర మంత్రులను కలుపు కొని పోయే విధంగా ఉండాలి కానీ వ్యక్తిగత దూషణలతో అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి నష్టం చేకూర్చొద్దని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మంత్రి లక్ష్మణ్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ సరైన రీతిలో స్పందించాలని కోరారు. కరీంనగర్ స్థానికతపై పదేపదే కామెంట్ చేస్తున్న పొన్నం ప్రభాకర్  అక్కడే పోటీ చేయకుండా పక్క నియోజకవర్గానికి ఎందు కు వెళ్లారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

కరీంనగర్ హెడ్‌క్వార్టర్స్‌లో జెండా ఎగురవేసే అంశంలో ఇతర మంత్రులను దూషించడం సరైనదికాదని శ్రీధర్‌బాబు అన్నారు. తనకు సూర్యాపేట జిల్లాలో జెండా ఎగరవేసే అవకాశం ఇచ్చారని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆటుపోట్లు తనకు కొత్త కాదని, 2001లో జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అందరితో కలిసి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు