04-08-2025 01:17:23 AM
హుజూర్ నగర్,ఆగస్టు 3 : టియుడబ్ల్యూజె (ఐజెయు) యూనియన్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావు తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డును అందుకున్నట్లు ఆదివారం ఆయన విలేకరులకు తెలిపారు. హైదరాబాదులోని రవీంద్రభారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ,
సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు సందర్భంగా శనివారం రాత్రి నిర్వహించిన కవి సమ్మేళనం అనంతరం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఈ అవార్డును శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి అందజేశారన్నారు. కాగా అవార్డు అందుకున్న నాగేశ్వరరావును పలువురు జర్నలిస్టులు, వివిధ పార్టీ నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు అభినందించారు.