calender_icon.png 7 July, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పార్టీ పేరును ప్రకటించిన అపరకుబేరుడు

07-07-2025 12:30:49 AM

- అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ఆరోపణ 

- 2026 ఎన్నికల్లో కీలక శక్తిగా మారడమే లక్ష్యమన్న మస్క్

వాషింగ్టన్, జూలై 6: అపరకుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్టు శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

‘అమెరికన్లకు మీ స్వేచ్ఛను తిరిగిస్తాం’ అనే నినాదంతో ముందుకొచ్చారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే కొత్త పార్టీని ప్రకటిస్తానని పేర్కొన్న మస్క్ అదే విధంగా చేశారు. కొత్త పార్టీ గురించి మస్క్ గతంలో ఎక్స్‌లో పోల్ నిర్వహించగా.. 80 శాతానికి పైచిలుకు దీనికి అనుకూలంగా ఓటేశారు. 

2026 ఎన్నికలే లక్ష్యం

కొత్త పార్టీ ఏర్పాటు గురించి గతంలో ఎక్స్‌లో నిర్వహించిన పోల్‌కు అనూహ్యస్పందన వచ్చిందని మస్క్ పేర్కొన్నారు. ‘ప్రతి ముగ్గురిలో ఇద్దరు కొత్త పార్టీని కోరుకుంటున్నారు. మీరు కోరుకున్నట్లే అది వస్తుంది. 2026లో జరిగే మధ్యంతర ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది.

రెండు నుంచి మూడు సెనేట్ స్థానాలు, 8 నుంచి 10 ప్రతినిధుల సభ స్థా నాల్లో పోటీ చేసి, కీలక చట్టాలపై నిర్ణయాత్మక శక్తిగా మారడమే తమ లక్ష్యం.’ అని మస్క్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఇటీవల విభేదాలు రావడంతో డోజ్ నుంచి వైదొలిగిన మస్క్ కొత్త పార్టీని ప్రకటించి సంచల నం సృష్టించారు. మస్క్ పార్టీ ప్రకటన చేసినప్పటికీ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని అధికారికంగా నమోదు చేయలేదు.