calender_icon.png 15 September, 2025 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

15-09-2025 12:00:00 AM

ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి రూరల్ సెప్టెంబర్ 14 : నిత్యం ప్రజా సమస్యలపై వార్తా కథనాలను ప్రచురిస్తూ నిలకడ లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. తన వంతు బాధ్యతగా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా శని ఆదివారాలు రెండు రోజులపాటు ఆమనగల్ కల్వకుర్తి ప్రాంతాల్లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా 240 మంది జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి కనీస వైద్య పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందుకు తన వంతుగా వన్ మేడ్ హబ్ సహకారంతో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా ట్రీట్మెంట్ అందించినట్లు తెలిపారు. ఈ హెల్త్ క్యాంపులో వివిధ మండలాల మీడియా మిత్రులతో పాటు,ఐక్యత ఫౌండేషన్ సభ్యులునరేందర్ గౌడ్, రఘు, యాదయ్య, రమేష్ నాయక్, కొండల్ యాదవ్, శ్రీపతి, శేఖర్, శ్రీను, నాగిళ్ల శివ, మహేష్, కళ్యాణ్, భాస్కర్ తదితరులుపాల్గొన్నారు.