15-09-2025 12:00:00 AM
ఇబ్రహీం పట్నం, సెప్టెంబర్ 14: అలసట నుంచి కాస్త చిల్ అవుదామని బేకరిలోకి వచ్చి లిమ్కా కూల్ డ్రింక్ తీసుకున్నారు. ఇంతలో తాగేందుకు సిద్ధమై ఓపెన్ చేద్దామని చూసేసరికి కూల్ డ్రింక్‌లో చనిపోయిన ఈగ దర్శనమిచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీలో పరిధి మంగల్ పల్లి చౌరస్తాలో ఉన్న బెంగళూరు బేకరీ అండ్ స్వీట్స్‌లో చోటు చేసుకుంది.
ఆదివారం సాయంత్రం కూల్ డ్రింక్ తాగుదామని వెళ్లిన ఒక వినియోగదారుడుకి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. ఈ విషయాన్ని బేకరీ యజమానిని అడగగా మాకు ఎలాంటి సంబంధం లేదని, ఏదైనా ఉంటే కూల్ డ్రింక్ సప్ప్లై చేసే డిస్టిబూటర్‌తో మాట్లాడుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించాడని తెలిపారు. దింతో వినియోగదారుడు డిస్ట్రిబ్యూటర్ ను చేరవాణి ద్వారా సంప్రదించగా అతను మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేశాడని, తిరిగి మళ్లీ కాల్ చేసిన స్పందించలేదని బాధితుడు తెలిపాడు.
ఈ సంఘటన పై పలువురు మాట్లాడుతూ.. ఇటీవల ఇబ్రహీంపట్నంలోనీ రాఘవేంద్ర హోటల్ లో దోషలో బొద్దింక, మై ఫీల్ హోటల్ బిర్యానీ లో బల్లి, పాయల్ స్వీట్ హౌజ్ పక్కోడిలో బొద్దింక, మెగా డి మార్ట్ పిండిలో పురుగులు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి బేకరీలో తనిఖీ చేసి, ఈ బేకరీ ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.