16-02-2026 12:00:00 AM
పురాతన శివాలయాలకు పోటెత్తిన భక్తులు
కన్నుల పండువగా శివపార్వతుల కల్యాణోత్సవం
ఆదిలాబాద్/నిర్మల్/కుమ్రం భీం ఆసిఫాబాద్/కాగజ్నగర్/వాంకిడి, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రా లు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలతో పాటు పురాతన శివాలయాల్లో సైతం వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగ, శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి.
ఆదివారం తెల్లవారుజాము నుండే పలు ఆలయాల్లో శివలింగా లకు అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో నిర్వహించారు. పలు ఆలయాల్లో శివపార్వతుల కల్యాణాన్ని అంగరం గ వైభవంగా చేపట్టారు. జిల్లాలో పురాతనమైన సిరికొండ మండలంలోని సిరిచల్మా లోని మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తు లు పోటెత్తారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ దంపతులు సిరిచల్మా ఆలయాన్ని దర్శించుకొని మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
అదేవిధంగా బేల మండలంలోని పురాతన ఆలయాలైన భాది నందీశ్వర ఆల యం శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా మహా శివరాత్రిని పురస్క రించుకుని ఆలయంలో జాతర వేడుకలను ఘనంగా జరపడం ఆనవాయితీగా వస్తోంది. వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన నందీశ్వర ఆలయంనీ నందీశ్వరుడు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అటు సదల్ పూర్ లోని బైరమ్ దేవ్ మహాదేవ్ ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు బోరజ్ మండలంలోని పెనుగంగా నది తీరాన వెలసిన శ్రీ ఓంకారేశ్వర ఉత్తరవాహిని ఆలయంకు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.
అదేవిధంగా ఆదిలాబాద్ రూరల్ మండలం కుంభఝారి గ్రామ సమీప అట వీ ప్రాంతంలో వెలసిన కోటిలింగాల దేవస్థానం వద్ద మహాశివరాత్రి వేడుకలు ఘనం గా సాగాయి. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి శివయ్యను దర్శించుకున్నారు. ఆదిలాబాద్‌లోని గాండ్ల సంఘం శివాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని నయనానందంగా తిలకించారు.
హర హర శంభో.. శివ శంభో..
నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని ప్రముఖ శివాలయాలు మహాశివరాత్రి పండుగ పుష్కరించుకుని భక్తులతో కిటికీటలాడాయి. జిల్లాలోని కదిలి పరమేశ్వర అన్నపూర్ణ ఆలయం ఓంకారేశ్వరాలయం బూరుగుపల్లి శివాలయం రాజరాజేశ్వర ఆలయం చీరాల దేవా లయం, గుడిసెరాల రాజరాజేశ్వర స్వామి, సూర్యాపూర్ శివాలయం బాసర సోన్ సిద్ధిలకుంట బ్రహ్మేశ్వర్ తదితర ఆలయాలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివలింగానికి అభిషేకం నిర్వహించారు. కదిలి ఆల యానికి భక్తులు పోటీ ఎత్తడంతో దర్శనానికి మూడు గంటలు పట్టింది.
ఆలయంలో అతను కలెక్టర్ కిషోర్ కుమార్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులు పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన పూజారులు పంచాక్షరి సిద్దు శంకర్ తదితరులు పాల్గొన్నారు
జిల్లావ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..
కుమ్రం భీం ఆసిఫాబాద్/కాగజ్నగర్/ వాంకిడి : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా శివాలయాలు శివభక్తులతో కిటకిటలాడాయి. వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీ వాగు తీరాన ఉన్న మూడు గోపురాల శివకేశవ ఆలయం, కాగజ్నగర్ మండలం ఈజ్గాం గ్రామంలోని శివ మల్లన్న ఆలయం,రెబ్బెన మండలం నం బాల శివాలయంతో పాటు జిల్లాలోని అనేక శివాలయాల్లో ఆదివారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.జిల్లా కేంద్రంలోని శివాలయం,బూరుగుడ లోని శివ పంచాయతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ చేపట్టారు.
వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయాలు ఆధ్యాత్మిక వైభ వాన్ని సంతరించుకున్నాయి. భక్తు లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీలు చలువ పందిళ్లు, క్యూలై న్లు ఏర్పాటు చేయగా, తాగునీరు, భోజన వసతి సదుపాయాలు కల్పించారు.ఈజ్గాం శివ మల్లన్న ఆలయంలో నిర్వహించిన పూజల్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు పాల్గొన్నారు. వాంకిడి శివాలయంలో జిల్లా ఎస్పీ నితికా పంత్ తన తం డ్రితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు.ఈ సందర్భంగా శివలింగాలకు ప్రత్యేక అభిషేకాలు, మహా రుద్రాభిషే కం, లింగోద్భవ పూజలు నిర్వహించగా, భజనలు, జాగరణ కార్యక్రమాలు కొనసాగాయి.
శివాలయాల్లో మొక్కులు చెల్లించుకున్న భక్తులు
మంచిర్యాల, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): జిల్లాలోని శైవక్షేత్రాలన్ని మహాశివ రాత్రి పర్వదినాన్ని పురష్కరించు కొని శివనామస్మరణతో ఆది వారం ఉదయం నుంచే మారుమోగాయి. ఉదయాన్నే భక్తులు శివాలయాలను దర్శిం చుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రాలైన జైపూర్ మండలంలోని వేలాల గట్టు మల్లన్న, చెన్నూరు మండలం కత్తెర శాల మల్లన్న, బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్రల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. భక్తులు సమీప గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి వేలాలో కొండపై వెలసిన మల్లికార్జున స్వామిని దర్శించుకు న్నారు.
ఇక్కడ మూడు రోజుల జాతర జరుగనుంది. మొదటి రోజు గుట్టపైన, రెండో రోజు గుట్ట కింద జాతర, మూడో రోజు గంగాదేవి జాతర జరుగనున్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పా ట్లు చేశారు. కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు వేలాల గట్టు మల్లికార్జున స్వామిని సామా న్య భక్తులతో కలిసి గుట్ట కింది నుంచి పైకి నడుచుకుంటూ వెళ్లి దర్శించుకున్న అనంతరం చెన్నూర్ మండలం లోని కత్తెరశాల మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
కిటకిటలాడిన గోదావరి తీరం
మహా శివరాత్రి సందర్భంగా భక్తులు ఆది వారం ఉదయం నుంచే జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్, మంచిర్యాల, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల గుండా ప్రవహించే గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఎక్కడ చూసి నా గోదావరి తీరం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. గోదావరి తీరం వద్ద స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా స్నానఘట్టాల వద్ద బట్టలు మార్చుకునేందుకు గదులు, అల్ఫాహారం, పండ్లు తదితర వసతులు సమకూర్చారు.