31 May, 2026 | 8:28 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

రికార్డులు సృష్టించిన శ్రేయాన్ష్ పటేల్

08-04-2026 12:45 AM

అభినందించిన మంత్రులు భట్టి, వాకిటి, కొండా సురేఖ

జూబ్లీహిల్స్, ఏప్రిల్ 7(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొండా శ్రేయాన్ష్ మురళీ కృష్ణ పటేల్ చదరంగం క్రీడలో సంచలనం సృష్టించాడు. కేవలం రెండు సంవత్సరాల 11 నెలల అత్యంత పిన్న వయస్సులోనే రెండు అసాధారణ ప్రపంచ రికార్డులను నెలకొల్పి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్‌లో స్థానం సంపాదించాడు. మం గళవారం జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ కాలనీ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన వేడుకలో ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రేయాన్ష్ తన అద్భుత మేధస్సును ప్రదర్శించాడు.

కేవలం 15 నిమిషాల 52 సెకన్లలో 93 బ్యాక్ ర్యాంక్ చెక్ మేట్స్ను పరిష్కరించడంతో పాటు, 1 గంట 9 నిమిషాల 9 సెకన్లలో 21 చెస్ బోర్డులను అత్యంత ఖచ్చితత్వంతో అమర్చి రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఏకైక బాలుడి గా శ్రేయాన్ష్ చరిత్ర సృష్టించాడు. ఈ వేడుకకు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అటవీ,

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. శ్రేయాన్ష్ ప్రదర్శనను చూసి మంత్రులు ఆశ్చర్యపోయారు. మంత్రులు అభినందించారు. ప్రపంచ రికార్డులను అధిగమించినం దుకు గాను, త్వరలోనే వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ ద్వారా బ్రిటీష్ పార్లమెంట్‌లో శ్రేయాన్ష్ కృష్ణ పటేల్కు ప్రత్యేక సత్కారం జరగనుంది. అక్క డ అధికారికంగా సర్టిఫికెట్ అందుకోనున్న ఈ చిచ్చరపిడుగు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతి ఖ్యాతిని చాటబోతున్నాడు.