3 April, 2026 | 3:16 AM

గుర్రంపై స్వారీ చేస్తూ ఓట్లు అభ్యర్థించిన జుక్కల్ ఎమ్మెల్యే

06-05-2024 02:00 AM

కామారెడ్డి, మే 5 (విజయక్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జుక్కల్ మండలంలోని బస్వాపూర్, వజ్రకండి, అవల్‌గావ్ తదితర గ్రామాల్లో గుర్రంపై స్వారీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కాసుల బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.