calender_icon.png 6 December, 2024 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం చేయాలి

28-10-2024 12:01:54 AM

నకిరేకల్‌లో రహదారిపై మృతుడి కుటుంబీకుల ధర్నా

నల్లగొండ, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చరణ్ మృతదేహాన్ని చూసేందుకు పోలీసులు అనుమతించడం లేదని నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో కుటుంబ సభ్యులు రహదారిపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. శాలిగౌరారం ఎస్‌ఐ సిబ్బందితో కలిసి తమను అడ్డుకున్నారని ఆరోపించారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే స్పందిం చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మం డలం మానాయికుంట వంతెన వద్ద ఆదివారం నిర్వహించతలపెట్టిన మూసీ పరివాహక రైతుల ఆత్మీయ సమ్మేళనానికి ఈ నెల 26న రాత్రి వంతెన సమీపంలో స్టేజీ ఏర్పాటు చేశారు.

గురుజాల నుంచి మానాయికుంటకు వైపు బైక్‌పై వెళ్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన చరణ్ (17) ప్రమాదవశాత్తు స్టేజీని ఢీకొట్టి మృతి చెందాడు. పోలీస్ స్టేషన్ శాలిగౌరారం సర్కిల్ పరిధి కావడంతో మృతదేహాన్ని నకిరేకల్‌కు తరలించారు.

కాగా ఆదివారం రాత్రివరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకపోవడం అధికారుల తీరుపై విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. సభ నిర్వహణకు రోడ్డును పూర్తిగా ఆక్రమించి స్టేజీ నిర్మించడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.