calender_icon.png 4 September, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను ఇండియా కూటమి అభ్యర్థిని కాదు

01-09-2025 03:03:23 PM

ఉప రాష్ట్ర పదవి రాజకీయ పదవి కాదు..

అందుకే నేను రాజకీయాల్లో ప్రవేశించలేదు..

చర్చకు భయపడి.. వెనక్కి తగ్గేదే లేదు..

నా ప్రయాణంలో ఎలాంటి బ్రేక్ కాదు.. కొనసాగింపే.. 

హైదరాబాద్: ఇండియా కూటమి(India Alliance) ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో(Justice Sudershan Reddy) పలు పార్టీలు సమావేశం అయ్యాయి. సమావేశంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా నాసిర్ హుస్సేన్ తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. నా స్నేహితుడు, గైడ్, ఫిలాసఫర్.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ నాసిర్ హుస్సేన్(AICC General Secretary Nasir Hussain) అన్నారు. ఈ బాధ్యత మోయగలుగుతానా అనే సందిగ్ధావస్థ ఉందన్నారు. రాజకీయ ముళ్ల కిరీటాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారని చాలా మంది అడిగారని వివరించారు. న్యాయశాస్త్ర పెనుబంధాన్ని ఎందుకు వీడుతున్నారని అడిగారని చెప్పారు. భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతోందని వెల్లడించారు. ఉప రాష్ట్ర పదవి రాజకీయ పదవి కాదు.. ఇప్పటివరకు ఐదుసార్లు రాజ్యాంగంపై ప్రమాణం చేశానని తెలిపారు. రాజ్యాంగానికి నిబద్దుడై.. విధేయుడై ఉంటానని ప్రమాణం చేశానని పేర్కొన్నారు. రాజ్యాంగానికి విధేయతతో పాటు సంరక్షించాలని సంవిధానం చెబుతోందని తెలిపారు. నా ప్రయాణంలో ఎలాంటి బ్రేక్ కాదు.. కొనసాగింపే అన్నారు. అందుకే నేను రాజకీయాల్లో ప్రవేశించలేదని వివరించారు. 

నేను ఇండియా కూటమి అభ్యర్థిని కాదని, కూటమిలో భాగస్వామ్యం కాకపోయినా ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడటం కోసమే ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. తనకు ఏ పార్టీలో సభ్యత్వం లేదు.. ఇకపై ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించనని స్పష్టం చేశారు. ఓటు వేసే ప్రతి పౌరుడు రాజకీయ అభిప్రాయం కలిగి ఉంటాడని సూచించారు. దేశ పౌరుడిగా క్రమం తప్పకుండా ఎన్నికల్లో పాల్గొంటానని తెలిపారు. పౌర సమాజం ప్రతినిధిగా వివిధ సమస్యలపై మాట్లాడుతానని పేర్కొన్నారు. పౌరహక్కులు, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతానని, రాజ్యాంగ ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడుతాను.. ఆదేశిక సూత్రాలు అమలు చేసే ప్రభుత్వాల సిద్ధాంతాలకు చెందిన వ్యక్తిని అని జస్టిస్ సుదర్శన్ తెలిపారు. ప్రాథమిక హక్కులతో పాటు ఆదేశిక సూత్రాలు అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. వనరుల సంపద ఎవరి చేతిలో కేంద్రీకృతం కాకుండా ప్రణాళికలు రచించాలని సూచించారు. స్త్రీ, పురుష సమానత్వం పాటించాలని ఆదేశిక సూత్రాలు చెబుతున్నాయన్నారు. ఆదేశిక సూత్రాలు అమలు చేయాలని కోరితే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఒక తీర్పు గురించి చర్చ ప్రారంభమైతే దాన్ని ఆహ్వానించానని తెలిపారు. చర్చకు భయపడి వెనక్కి తగ్గుతానని అనుకున్నారు.. సవాల్ ను స్వీకరించి ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని తేల్చిచెప్పారు. నేను ఇచ్చిన తీర్పును చదవండి.. చర్చించండి.. సంభాషించండి.. నేను ఎక్కడైనా.. ఎవరినైనా సమర్థించినట్లు ఉంటే శిరస్సు వంచి మీ మాట గౌరవిస్తానని జస్టిస్ సుదర్శన్ వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడేటప్పుడు.. అది చదివి మాట్లాడాలని సూచించారు. నాకంటే ముందు.. తర్వాత 11 మంది జడ్జిలు ఆ తీర్పు విన్నారని తెలిపారు. తీర్పులో ఒక్క అక్షరం, పులిస్టాప్, కామ ఎవరూ మార్చలేరని వెల్లడించారు. ఈ విషయాలు తెలుసుకుని ఉంటే అలాంటి భాష వాడరని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.