01-09-2025 03:01:44 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లోని తంగళ్లపల్లి మండలం మండపెల్లి గ్రామంలో ఇందిరమ్మ కాలని స్మశానవాటిక గురించి పట్టించుకొని అధికారులు.. గత కొంతకాలంగా ఇందిరమ్మ కాలనిలోని స్మశానవాటిక అధికారులు పట్టించుకోవటం లేదు. ఇక్కడ కనీస వసతి సదుపాయాలు లేవు అని గ్రామప్రజలు వాపోతున్నారు. నీటి సదుపాయం కాని, మహిళలకు కనీస టాయిలెట్లు సదుపాయం లేదు. దీనిపైనా అధికారులకి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ముందుకు వచ్చి కనీస వసతి సౌకర్యాలు కలిపించాలని గ్రామ ప్రజలు కోరుకుకుంటున్నారు.