calender_icon.png 7 December, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలికి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చేయూత

07-12-2025 08:16:31 AM

మంగపేట,(విజయక్రాంతి): మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామానికి కి చెందినటువంటి మూల లక్ష్మీప్రసన్న అనే వృద్ధురాలు గత కొన్ని సంవత్సరాలుగా మంగపేట యూనియన్ బ్యాంక్ పక్కన ఉన్నటువంటి మయూరి స్టూడియో ముందు కూర్చొని బ్యాంక్ కు వచ్చేటువంటి కస్టమర్లు బ్యాంక్ కు సంబంధించిన ఫామ్స్ ఫిలప్ చేస్తూ కస్టమర్లు ఎంతోకొంత ఇచ్చే అటువంటి డబ్బులతో జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. కానీ ఆ వృద్ధురాలు కూర్చొని రాయడానికి ఇబ్బందికరంగా ఉండటంతో ఈ విషయాన్ని గ్రహించిన జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు దాతల సహకారంతో లక్ష్మీ ప్రసన్న కి ఈరోజు కూర్చొని రాయడానికి ఒక బెంచిని ఇవ్వడం జరిగింది