28-11-2025 04:58:09 PM
భద్రాద్రి కొత్తగూడెం
అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన దిశాలి పూలే
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సభ
కొత్తగూడెం,(విజయక్రాంతి): భారత ప్రథమ సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు, మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 135 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుండాల సృజన్, నాయకులు ఉమామహేష్, రాజ్ కమల్, రాజేష్, వాసు, బట్టు వినోద్, మమత, కళ్యాణి, వసంత, వందన, సబితాలతో కలసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ముందంజ వేయడానికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. పూలే దంపతులు భారత సామాజిక–సాంస్కృతిక పునరుజ్జీవనానికి శిల్పులని, వారి స్ఫూర్తితో విద్యార్థులు విద్యలో రాణిస్తూ, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
సామాజిక వివక్షకతపై వారి పోరాటాన్ని గుర్తు చేసి వారు సామాజిక విప్లవ పితామహుడని వారి బాటలోనే బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, భారత దేశ చరిత్రలో రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్, నారాయణ గురు లాంటి యోధులు ఉద్యమాలు నిర్వహించి సామాజిక మార్పు కోసం బాటలు వేశారని గుర్తు చేశారు. ఆ మహనీయుల స్ఫూర్తితో మనం స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అనుభవిస్తున్నామని కొనియాడారు.