28-11-2025 04:42:05 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన స్థానికులను తీవ్ర షాక్‌కు గురిచేసింది. మండల కేంద్రానికి చెందిన మంచకట్ల లలిత (56) గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందినారు. శుక్రవారం మానేరు వాగులో ఆమె మృతదేహం లభ్యం కావడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
తల్లిని ఆ స్థితిలో చూడగానే షాక్‌కు గురైన ఆమె కుమారుడు అభిలాష్ తీవ్ర మనోవేదనతో అక్కడికక్కడే అదే వాగులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే స్పందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.
కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్ మృతదేహం కూడా గాలింపు చర్యల్లో లభ్యమైంది. తల్లి, కొడుకు ఇద్దరి వరుస మృతులతో తంగళ్ళపల్లి మండలంలో తీవ్ర విషాదం అలుముకుంది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.