28-11-2025 05:01:07 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఏఐసీసీ ఎస్సీ సెల్ నేషనల్ కోర్డినేటర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ డా. బిఆర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఆరెపల్లి రాహుల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన రాహుల్ కు కండువా కప్పి పార్టీలోకి ఎంపీ వంశీ కృష్ణ ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో నాయకులు బాలసాని సతీష్ గౌడ్, బొంకురి కైలాసం, గడ్డం సతీష్, మహేష్, రవి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.