28-11-2025 05:03:21 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 15న సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలలో మండలంలోని గట్టపల్లి జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జి.రమాదేవి, మానహ జిల్లా స్థాయిలో అండర్ 13,15 బ్రాంజ్ మెడల్స్ సాధించి, ఈనెల 28 నుండి 30 తేదీ వరకు హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులను హెచ్ఎం వి. అన్నపూర్ణ, పిడి ప్రణయ్,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామస్తులు శుక్రవారం అభినందించారు.