28-11-2025 05:09:44 PM
బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను బోయిన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య బృందం సందర్శించి, పిల్లలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులను పంపిణీ చేశారు. తదనంతరం పిల్లలకు నోటి పరిశుభ్రత, హ్యాండ్ వాష్ టెక్నిక్, చలికాలంలో వచ్చే నిమోనియా, అస్తమా,ఎలర్జీకి సంబంధించిన వ్యాధులపై పిల్లలకు అవగాహన కల్పించారు.
అనంతరం స్కూల్ హాస్టల్ ను సందర్శించి పిల్లలకు పరిశుభ్రమైన పోషకాహారాన్ని, వేడి వేడిగా ఎప్పటికప్పుడు అందించాలని వార్డెన్ కి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కార్తీక్, సూపర్వైజర్సు టి.హేమలత, , ఎస్.ఓ లింగవ్వ ,సబ్ సెంటర్ ఆరోగ్య కార్యకర్త ఉషాదేవి, స్కూల్ ఆరోగ్య కార్యకర్త ప్రసన్న, ఆశా కార్యకర్త లత తదితరులు పాల్గొన్నారు.