calender_icon.png 28 November, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా ఉంటూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

28-11-2025 04:55:40 PM

ఫజుల్ నగర్ చెక్ పోస్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): పంచాయతి  ఎన్నికల సందర్భంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫజుల్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ఈరోజు ఆకస్మిక తనిఖీ చేసి వాహన తనిఖీలు చేసి నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించడంతో పాటు, ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహారించందంతో పాటు, వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ వెంకట్రాజం,చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.