calender_icon.png 28 November, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినిల భద్రతపై విద్యసంస్థలలో ప్రత్యేక అవగాహన

28-11-2025 05:06:45 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే  ఆదేశాల మేరకు జిల్లా షీ టీమ్ బృందం ప్రతి రోజు జిల్లా పరిధిలో ఉన్న విద్య సంస్థలు సంద్రశిస్తూ గుడ్ టచ్/బ్యాడ్ టచ్/ర్యాగింగ్/ఇవిటీజింగ్/పోక్సో/షీటీమ్స్/మహిళ చట్టలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా గంభిరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డిపేట గ్రామంలో ZPHS పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించి, వేధింపులకు గురైన వెంటనే 87126 56425  షీ టీమ్ కి ఫిర్యాదు చేయాలని, ఇటువంటి సంఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పిర్యాదు చేసినవారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని  అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏ. ఎస్.ఐ ప్రమీల, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.