05-12-2025 12:24:49 PM
దాతర్ పల్లి సర్పంచ్ అభ్యర్థి తలారి స్వాతి స్వామి
గజ్వేల్: దాతరపల్లి గ్రామ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని ఓటు వేసి ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించాలని బి ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి తళారి స్వాతి స్వామి అన్నారు. శుక్రవారం గ్రామంలో నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి స్వాతి స్వామి మాట్లాడుతూ గ్రామంలోని సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. తను ఓటు వేసి సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు తాటికొండ కర్ణాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్, ఉపసర్పంచ్ స్వామి, నాయకులు కొత్తపల్లి సుమన్, యోగి రాజ్, సత్యనారాయణ సాయిబాబా కనకయ్య పోచయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.