calender_icon.png 5 December, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీరంగూడ గుట్టలో అన్నదాన సత్రం విస్తరణకు శంకుస్థాపన

05-12-2025 12:22:47 PM

చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం

బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన ప్రాంగణంలో అన్నదాన సత్రం విస్తరణ కార్యక్రమానికి శంకుస్థాపన జరిగింది. దేవస్థాన చైర్మన్ సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, దాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, అన్నదాన సత్రం విస్తరణ పనులకు మొత్తం రూ.3 లక్షల వ్యయం అవుతుందని తెలిపారు. దీనిలో భాగంగా తిరుమల హాస్పిటల్ ఎండీ తిరుపతి రావు రూ.1,50,000 విరాళంగా అందించారని పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని వివిధ భక్తులు, దాతల సహకారంతో సమకూర్చి పనులు చేపట్టుతున్నామని చెప్పారు. దేవస్థానాన్ని అభివృద్ధి పరచడం, భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు అందించడమే తమ ధ్యేయమని సుధాకర్ యాదవ్ అన్నారు. అన్నదాన సత్ర విస్తరణ పూర్తి అయితే గుట్టకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా సేవలు అందించగలమని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవదాయ శాఖ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.